
విజయనగరం (Vijayanagaram): ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పనిచేయకుండా పార్టీలో కొనసాగుతామంటే కుదరదన్నారు. వైసీపీ (YCP) నాయకులు, కార్యకర్తల్లో రెండో ఆలోచన మొదలైందన్నారు. అదే నిజమైతే అందరం నష్టపోతామని అన్నారు. రాష్ట్ర స్థాయి వైసీపీ ప్లీనరీకి హాజరయ్యే కార్యకర్తలకు.. సకల ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత శాసనసభ్యులదేనని మంత్రి బొత్స స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి