చంద్రబాబు ఢిల్లీకి ఎందుకొచ్చారు?: విజయసాయిరెడ్డి

ABN , First Publish Date - 2021-10-27T19:54:29+05:30 IST

చంద్రబాబు ఢిల్లీకి ఎందుకొచ్చారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.

చంద్రబాబు ఢిల్లీకి ఎందుకొచ్చారు?: విజయసాయిరెడ్డి

న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఢిల్లీకి ఎందుకొచ్చారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అమిత్‌షాపై రాళ్లు వేసిన వీడియో చూపించేందుకా?, ఢిల్లీలో వ్యవస్థలను ప్రభావితం చేసేందుకా? అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని విమర్శించారు. న్యాయం, ధర్మం ఏమీ లేని వ్యక్తిని, ప్రతిపక్ష నాయకుడి పాత్రను పోషించలేకపోతున్నారని విమర్శించారు. చంద్రబాబు 36 గంటల బూతు దీక్ష నిర్వహించారన్నారు. పట్టాభి వ్యాఖ్యలను చంద్రబాబు సమర్థిస్తున్నారా? అని ప్రశ్నించారు. ఏపీలో ఆర్టికల్ 356 తీసుకొచ్చే పరిస్థితులు లేవని విజయసాయిరెడ్డి అన్నారు.


తాము రాష్ట్రపతిని కలిసి ఏపీ పరిస్థితులను వివరిస్తామని విజయసాయి స్పష్టం చేశారు. సీఈసీని గురువారం సాయంత్రం 4 గంటలకు కలుస్తామన్నారు. వ్యవస్థలను చంద్రబాబు మేనేజ్ చేస్తున్నారని, ఆయనొక ఉగ్రవాది అనడంలో సందేహం లేదన్నారు. ఢిల్లీలో చంద్రబాబుకు ఏ రాజకీయ నేత అపాయింట్‌మెంట్ ఇవ్వలేదన్నారు. రాష్ట్రపతి ఒక్కరే మొక్కుబడిగా అపాయింట్‌మెంట్ ఇచ్చారన్నారు. పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విజయసాయి విమర్శించారు.

Updated Date - 2021-10-27T19:54:29+05:30 IST