విజయసాయి వర్సెస్ రఘురామ
ABN , First Publish Date - 2022-06-13T01:27:59+05:30 IST
ట్విటర్లో ఎంపీ విజయసాయిరెడ్డి వర్సెస్ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నట్లుగా తలపడ్డారు. రఘరామపై విజయసాయి ట్వీట్స్ తీవ్ర విమర్శలు చేశారు.
అమరావతి: ట్విటర్లో ఎంపీ విజయసాయిరెడ్డి వర్సెస్ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నట్లుగా తలపడ్డారు. రఘరామపై విజయసాయి ట్వీట్స్ తీవ్ర విమర్శలు చేశారు. విజయసాయికి అంతే ధీటుగా రఘురామ కౌంటరిచ్చారు. ‘‘అవును నాకున్నది విగ్గు.. ఎన్ని తన్నులు తిన్నా నీకు లేనిది సిగ్గు. కొత్తగా రాజీనామా అంటున్నారు.. నువ్వు.. నీ గ్యాంగ్ లీడర్.. అనర్హత వేటుపై చేతులు ఎత్తేశారా?. నేను ఏపీకి వస్తే సీఎంకు మైండ్ బ్లాక్ అవ్వుద్దనేగా.. నాపై కేసులు పెట్టిస్తున్నారు’’ అని ట్విటర్లో రఘురామకృష్ణరాజు పోస్టు చేశారు.