
హైదరాబాద్: కరెంట్ చార్జీల పెంపుతో కేసీఆర్ సర్కారు పేద ప్రజలపై మోయలేని భారాన్ని వేసిందని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు. పేదల నుండి మధ్య తరగతి వరకు ఎవ్వరినీ వదలకుండా కరెంటు షాక్ ఇచ్చిందని ఎద్దేవా చేశారు. కరెంటు ఛార్జీల పెంపును నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో నిరసనలు చేపట్టామని ఆమె తెలిపారు. రాష్ట్ర ప్రజలపై ఏకంగా రూ.6వేల కోట్ల భారాన్ని మోపడం దారుణమని విజయశాంతి విమర్శించారు. ప్రభుత్వ శాఖలు వాడుకున్న కరెంట్‌కు బిల్లులు చెల్లించడం లేదని, పాతబస్తీలో కరెంట్ బిల్లులు వసూలు చేసే దమ్ము ప్రభుత్వానికి లేదన్నారు.