ltrScrptTheme3

ఎన్నికలప్పుడు బంధు.. విద్యావంతుల పాలిట రాబందు

Sep 27 2021 @ 12:05PM

హైదరాబాద్: ఆ బంధు.. ఈ బంధు అంటూ ఎన్నికలప్పుడు హడావుడి చేసే సీఎం కేసీఆర్ విద్యావంతుల పాలిట రాబందు అని బీజేపీ నాయకురాలు విజయశాంతి పేర్కొన్నారు. దాదాపు 60 వేలకు పైగా విద్యావంతులైన యువతరం ఉద్యోగాల్లేక స్ట్రీట్ వెండార్లుగా మారారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 'పట్టణ ప్రగతి - సర్వే ఆఫ్ స్ట్రీట్ వెండార్స్' యాప్‌లో వీధి వ్యాపారుల కేటగిరీలో నమోదైన వివరాలు గమనిస్తే గుండె చెరువయ్యే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయన్నారు.



‘‘తెలంగాణలో ఆ బంధు... ఈ బంధు అంటూ ఎన్నికలప్పుడు లేనిపోని హడావుడి చేసే సీఎం కేసీఆర్ గారు విద్యావంతుల పాలిట రాబందులా మారారు. ఇందుకు అతి పెద్ద ఉదాహరణ. ఇటీవల మీడియాలో గణాంకాలతో సహా బయటికొచ్చిన తెలంగాణలోని విద్యావంతుల పరిస్థితి. ఈ నివేదిక ప్రకారం తెలంగాణలో దాదాపు 60 వేల మందికి పైగా విద్యావంతులైన యువతరం మరో మార్గం లేక స్ట్రీట్ వెండార్లుగా మారి తోపుడు బండ్లతో రోడ్ల మీదికి వచ్చారు. నోటిఫికేషన్లు రావు... ఉద్యోగాల్లేవు... నిరుద్యోగభృతి లేదు... ఆశ నిరాశల మధ్య ఆత్మహత్యలు ఆగడం లేదు. 'పట్టణ ప్రగతి - సర్వే ఆఫ్ స్ట్రీట్ వెండార్స్' యాప్‌లో వీధి వ్యాపారుల కేటగిరీలో నమోదైన వివరాలు గమనిస్తే గుండె చెరువయ్యే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 

ఈ తాజా స్ట్రీట్ వెండార్స్‌లో పీజీలు చేసినవారు. టెక్నికల్ కోర్సులు పూర్తి చేసినవారు, కరోనా ప్రభావం వల్ల ఉద్యోగాలు కోల్పోయిన ప్రైవేట్ ఉపాధ్యాయులు... ఇలా ఎందరెందరో కన్నీటి ధారలతో కనిపిస్తున్నారు. తెలంగాణలో ఉద్యోగాల మాట కల్ల అని స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలా ఈ వార్తా కథనం వాస్తవాల్ని ప్రజల ముందుంచింది. ప్రధానమంత్రి స్వనిధి ద్వారా మోదీగారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అందించిన రూ.10 వేల రుణమే వీరికి కాస్తో కూస్తో ఊరట కాగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వారిని వీధిన పడేయటం తప్ప చేసిందేమీ లేదని బాగా తెలిసొచ్చింది’’ అని రాములమ్మ తెలిపారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.