
హైదరాబాద్: దేశవ్యాప్తంగా పొత్తులు ఏర్పరుచుకుని ఎంఐఎం సుమారు 20 ఎంపీలు గెల్చికోవడం, అందుకు అవసరమైన సకల వనరులు కేసీఆర్ సమకూర్చడం ఆ రెండు సయామీ ట్విన్ పార్టీ పెద్దల అవగాహన అని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. అందుకు ప్రతిగా తెలంగాణలో హైదరాబాద్ తప్ప మరెక్కడా పోటీ చేయకుండా ఉండి, ఎంఐఎం ఓట్లు టీఆరెస్‌కు వేయించడం వారి ఒప్పందమని ఆమె చెప్పారు. అందుకే వేరే రాష్ట్రాల్లో పోటీ చేసే ఎంఐఎం ఇక్కడ మాత్రం పోటీ చేయదన్నారు. ఈ విషయం టీఆర్ఎస్ ఎంత దాచినా ప్రజలకు తెలిసిన బహిరంగ రహస్యమేనని చెప్పారు. టీఆరెస్, కాంగ్రెస్, ఎంఐఎంలకు దేశవ్యాప్త అవగాహన విస్తరణ కార్యాచరణ కార్యక్రమం ప్రశాంత్ కిషోర్‌ది అనేది విస్పష్టమైందని విజయశాంతి తెలిపారు.
ఇవి కూడా చదవండి