పథకానికి పేరు పెట్టుకుంటేనే చాలదు: కేసీఆర్‌ కిట్‌‌పై రాములమ్మ సెటైర్లు

ABN , First Publish Date - 2022-03-08T04:20:43+05:30 IST

హైదరాబాద్: కేసీఆర్ కిట్‌‌ను కేటీఆర్ ఆకాశానికి ఎత్తుతున్నారని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఎద్దేవా చేశారు.

పథకానికి పేరు పెట్టుకుంటేనే చాలదు: కేసీఆర్‌ కిట్‌‌పై రాములమ్మ సెటైర్లు

హైదరాబాద్: కేసీఆర్ కిట్‌‌ను కేటీఆర్ ఆకాశానికి ఎత్తుతున్నారని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల కోసం వస్తున్న వారి సంఖ్య పెరిగిందని, కేసీఆర్‌ కిట్లతో అనేక సానుకూల మార్పులు చోటుచేసుకున్నాయని... కేటీఆర్ రోజు చెప్పే అబ‌ద్దాల‌తోనే సావాసం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ప‌థ‌కానికి పేరు పెట్టుకుంటేనే స‌రిపోదని, అది అమ‌ల‌య్యేలా చ‌ర్యలు కూడా తీసుకోవాలని ఆమె సలహా ఇచ్చారు. పారాసిట్మాల్‌తో క‌రోనా త‌గ్గుతుంద‌ని చెప్పే కేసీఆర్‌కు ప్రజల ఆరోగ్యం గురించి పట్టదని విజయశాంతి చెప్పారు.  ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసిన కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు త‌గిన గుణ‌పాఠం చెబుతారని ఆమె జోస్యం చెప్పారు. కేసీఆర్ కిట్‌‌ పథకానికి రూ.200 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్లు వైద్య వర్గాలే చెబుతున్నాయని ఆమె గుర్తు చేశారు. ఏడాదిగా పథకం అమలవ్వని జగిత్యాల జిల్లాలోనే రూ.6.91 కోట్లు బకాయిలు ఉన్నాయని విజయశాంతి చెప్పారు.



Updated Date - 2022-03-08T04:20:43+05:30 IST