రాష్ట్రంలోని చెరువులన్నింటినీ మింగేస్తున్నారు..

ABN , First Publish Date - 2022-06-24T02:28:20+05:30 IST

రాష్ట్రంలో చెరువులన్నింటినీ టీఆర్ఎస్ నాయకులు మింగేస్తున్నారని బీజేపీ నేత విజయశాంతి ఆరోపించారు. నిజామాబాద్ జిల్లాలో ఇటీవల చెరువులు ఆనవాళ్లు...

రాష్ట్రంలోని చెరువులన్నింటినీ మింగేస్తున్నారు..

హైదరాబాద్: రాష్ట్రంలో చెరువులన్నింటినీ టీఆర్ఎస్ నాయకులు మింగేస్తున్నారని బీజేపీ నేత విజయశాంతి ఆరోపించారు. నిజామాబాద్ జిల్లాలో ఇటీవల చెరువులు ఆనవాళ్లు కోల్పోతున్నాయన్నారు. ఇంత జరుగుతున్నా కబ్జాదారులపై ఎవరూ ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని మండిపడ్డారు. యథేచ్ఛగా కబ్జాలకు దిగుతున్న టీఆర్ఎస్ నాయకులకు ప్రజలే బుద్ధి చెబుతారని ఆమె పేర్కొన్నారు. గురువారం సోషల్ మీడియా వేదికగా ఆమె పలు విమర్శలు చేశారు. అవి ఆమె మాటల్లోనే..


‘‘టీఆర్ఎస్ నాయ‌కులు చెరువుల‌ను మింగేస్తున్నరు. తెలంగాణ అంతటా ఇదే ప‌రిస్థితి. తాజాగా నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలోని చెరువులు ఆనవాళ్లు కోల్పోతున్నాయి. జిల్లాలో 1,147 వరకు చెరువులు ఉండగా వీటి పరిధిలో సుమారు 2 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఆక్రమణలతో చెరువు పరిధి, నీటి సామర్థ్యం తగ్గి సాగు విస్తీర్ణంపై కూడా ఎఫెక్ట్ పడుతోంది. కేసీఆర్ ఓ వైపు సాగునీటి వనరుల అభివృద్ధి పేరుతో క‌మిష‌న్లు దండుకుంటే.. మరోవైపు అధికార పార్టీ లీడర్లు రియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్టేట్ వ్యాపారులతో కలిసి చెరువులను కబ్జా చేస్తున్నారు. డిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి మండలం ఘన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌లో 98 ఎకరాల్లో ఉన్న రాజరాజేశ్వరి చెరువులో దాదాపు 8 ఎకరాలను కబ్జా చేసేశారు.


‘‘నడిపల్లి పంచాయతీ పరిధిలో నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైవే 44 పక్కనే 35 ఎకరాల్లో ఏదుల్లా చెరువు ఉంది. ఇందులో 30 శాతం కబ్జాకు గురైంది. అధికార ప్రజాప్రతినిధుల అండదండలు ఉండడంతో కబ్జాకు గురైన భూమికి కన్వర్షన్లు కూడా లభిస్తున్నయి. దీని గురించి పైఆఫీసర్లకు కూడా ఫిర్యాదు అందినా.... క‌బ్జాదారుల‌పై వారు ఏ చ‌ర్య‌లూ తీసుకోవ‌డం లేదు. జిల్లాలోని మొత్తం 1,147 చెరువుల్లో15 శాతం అంటే...161 చెరువులు కబ్జాల పాలవుతున్నట్టు ఇటీవల పలు సర్వేల్లో తేలింది. ప్రధానంగా నేషనల్‌‌‌‌‌‌‌‌ హైవే 44 పక్కన ఉన్న బాల్కొండ, ఆర్మూర్, జక్రాన్‌‌‌‌‌‌‌‌ పల్లి, డిచ్‌‌‌‌‌‌‌‌పల్లి, ఇందల్వాయి మండల కేంద్రాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి.


‘‘దీంతో ఆ మండలాల పరిధిలో ఉన్న చెరువులపై రియల్టర్ల కన్ను పడింది. నాందేడ్ నేషనల్‌‌‌‌‌‌‌‌ హైవేలో ఎడపల్లి, బోధన్ మండలాల చెరువులు కూడా కబ్జాలకు గురై రియల్ వెంచర్లు వెలుస్తున్నయి. ఇంత దారుణంగా చెరువులు, శిఖం భూములు కబ్జాలు గురువుతున్నా ఇరిగేషన్, రెవెన్యూ శాఖలు పట్టించుకోవడంలేదు. ఆఫీసర్లు ఇప్పటికైనా స్పందించాలి. 1975 రికార్డుల రీ సర్వే చేసి చెరువులను కాపాడాలి. చెరువుల‌ను య‌థేచ్చ‌గా మింగుతున్న టీఆర్ఎస్ నాయ‌కుల‌కు తెలంగాణ ప్ర‌జానీక‌ం త‌గిన విధంగా బుద్ధి చెప్ప‌డం ఖాయం’’.. అని విజయశాంతి పేర్కొన్నారు.



Updated Date - 2022-06-24T02:28:20+05:30 IST