విజయవాడ: అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం చేయాలంటూ ముస్లిం సంఘాలు తమ ఆందోళనను ఉధృతం చేశారు. నేడు ఛలో అసెంబ్లీకి జెఎసి నేతలు పిలుపునివ్వగా...వివిధ రాజకీయ, ప్రజా సంఘాలుమద్దతు ప్రకటించాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు పలువురు నేతలను ముందస్తుగా హౌస్ అరెస్టు చేశారు. జేఎసి కన్వీనర్ ఫారూఖ్ షుబ్లీ మాట్లాడుతూ... అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటన దారుణమన్నారు. ఈ ఘటన ప్రజలను కలచివేసినా... ప్రభుత్వం మాత్రం కదలడం లేదని మండిపడ్డారు. నెల రోజుల నుంచి పోరాటం చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదని.. అందుకే ఈరోజు ఛలో అసెంబ్లీ కి పిలుపునిచ్చామని తెలిపారు. పోలీసులతో తమ పోరాటాన్ని ఆపాలని ప్రభుత్వం కుట్రలు చేస్తుందని విమర్శించారు. తననాకు హౌస్ అరెస్టు అని నోటీసు ఇచ్చి.. స్టేషన్‌కు రమ్మంటున్నారని తెలిపారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు తమ పోరాటాన్ని తీసుకెళతామన్నారు. అబ్దుల్ సలాం మరణానికి కారకులైన వారిని శిక్షించే వరకు తమ ఉద్యమం ఆగదని షారూఖ్ స్పష్టం చేశారు.