విజయవాడ: కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ హాస్టల్ భవనంపై నుండి దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తీవ్రగాయాలతో నాలుగు గంటల పాటు రోడ్డుపై పడి ఉన్న విద్యార్థినిని సెక్యూరిటీ సిబ్బంది గుర్తించని పరిస్థితి. ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని హారిక స్వస్థలం రాజమండ్రి. ఆత్మహత్యయత్నానికి పాల్పడిన హారిక పరిస్థితి విషమంగా ఉంది. చేతిపై గాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
ఇవి కూడా చదవండి