ప్రయాణికుల పట్ల గౌరవం చూపండి

ABN , First Publish Date - 2022-05-28T06:10:03+05:30 IST

ప్రయాణికుల పట్ల గౌరవం చూపడంతో పాటు ఆటోడ్రైవర్లు మంచి అలవాట్లతో ఉండాలని పోలీసు అదనపు ఉపకమిషనర్‌ (ట్రాఫిక్‌) టి. సర్కార్‌ అన్నారు.

ప్రయాణికుల పట్ల గౌరవం చూపండి
ప్రసంగిస్తున్న పోలీసు అదనపు ఉపకమిషనర్‌ సర్కార్‌

ప్రయాణికుల పట్ల గౌరవం చూపండి

 ఆటోడ్రైవర్లకు పోలీసు అదనపు ఉప కమిషనర్‌ సర్కార్‌ సూచన

గాంధీనగర్‌, మే 27:  ప్రయాణికుల పట్ల గౌరవం చూపడంతో పాటు ఆటోడ్రైవర్లు మంచి అలవాట్లతో ఉండాలని పోలీసు అదనపు ఉపకమిషనర్‌ (ట్రాఫిక్‌) టి. సర్కార్‌ అన్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలోని విజయవాడ ఆటో వర్కర్స్‌ యూనియన్‌ సెంట్రల్‌ సిటీ 11వ వార్షికో త్సవ సభ గాంధీనగర్‌లోని హనుమంత రాయ గ్రంథాలయంలో శుక్రవారం జరిగింది. సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, ఆటో డ్రైవర్లు ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. యూనియన్‌ గౌరవ అధ్యక్షుడు దోనేపూడి కాశీనాఽథ్‌ మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా కార్మికులంతా ఐక్యంగా పోరాడాలన్నారు. ఎన్‌టీఆర్‌ జిల్లా సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఎన్‌ సీహెచ్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ, ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం జూన్‌,జూలై నెలల్లో పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సి ఉందన్నారు. సత్యనారాయణపురం పోలీసు సీఐ బాల మురళీకృష్ణ, ఎన్‌టీఆర్‌ జిల్లా సీఐటీయూ అధ్యక్షుడు ఎ వెంకటేశ్వరరావు, సెంట్రల్‌ సిటీ సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఎంవీ సుధాకర్‌, కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టిన సెంట్రల్‌ సిటీ ఆటో వర్కర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి కె దుర్గారావు, తూర్పు, పశ్చిమ ఆటో వర్కర్ల యూనియన్‌ కార్యదర్శులు బి. రూబెన్‌ కుమార్‌, ఎస్‌డీ కరీముల్లా మాట్లాడారు. అనంతరం 23 మందితో నూతన కమిటీ ఏర్పడింది. అధ్యక్షుడిగా కె. దుర్గారావు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఎస్‌కే దుర్గావలి, ప్రధాన కార్యదర్శిగా ఎం.హనుమంతరావు, కార్యనిర్వాహక కార్యదర్శిగా డి కోటయ్య, కోశాధికారిగా ఏ.నాగబ్రహ్మ, ఉపాధ్యక్షులుగా పి.గణేష్‌(చిన్న), బి. కుమార్‌, సహాయ కార్యదర్శిగా పి. తిరుపతయ్య ఎన్నికయ్యారు.

Updated Date - 2022-05-28T06:10:03+05:30 IST