Varla Ramiah: చంద్రబాబుకు భద్రతలో ప్రభుత్వ వైఫలం

ABN , First Publish Date - 2022-07-22T03:56:44+05:30 IST

ప్రతిపక్షనాయకునిగా చంద్రబాబు (Chandrababu)ది క్యాబినెట్ మంత్రి (Cabinet minister) హోదా అని...

Varla Ramiah: చంద్రబాబుకు భద్రతలో ప్రభుత్వ వైఫలం

విజయవాడ (Vijayawada): ప్రతిపక్షనాయకుడిగా చంద్రబాబు (Chandrababu)ది క్యాబినెట్ మంత్రి (Cabinet minister) హోదా అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య (Tdp politburo member varla ramaiah) అన్నారు. మూడు రోజుల క్రితమే వరద బాధిత ప్రాంతాలలో పర్యటిస్తారని ప్రభుత్వానికి సమాచారo ఇవ్వడo జరిగిందని చెప్పారు. చంద్రబాబు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న వ్యక్తి అని.. అయినా పర్యటనకు ఏర్పాట్లు చేయడములో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు జగన్ రెడ్ది పాదయాత్రకు ఏ రకంగా బందోబస్తు ఇచ్చింది ఒకసారి గుర్తుచేసుకోవాలన్నారు. ఈనాటి ఈ ప్రమాదంలో నిర్లక్ష్యo వహించిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. 


Updated Date - 2022-07-22T03:56:44+05:30 IST