మాజీ మేయర్‌ గోవిందరాజులు మృతి

ABN , First Publish Date - 2022-08-19T05:57:52+05:30 IST

మాజీ మేయర్‌ గోవిందరాజులు మృతి

మాజీ మేయర్‌ గోవిందరాజులు మృతి

నేడు అంత్యక్రియలు

విద్యాధరపురం, ఆగస్టు 18  : సీపీఐ సీనియర్‌ నాయకుడు, నగరపాలక సంస్థ మాజీ మేయర్‌ లంకా గోవిందరాజులు గురువారం కన్నుమూశారు. కొద్దిరోజుల కిందట ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఆరోగ్యం క్షీణించడంతో మృతిచెందారు. ఆయన భౌతికకాయాన్ని గురువారం రాత్రి వరకూ నగరంలోని దాసరి భవన్‌ వద్ద ఉంచారు. పలువురు నాయకులు పార్టీ అభిమానులు, కార్యకర్తలు నివాళులర్పించారు. అనంతరం విజయా టాకీస్‌ సెంటర్‌లోని ఆయన స్వగృహానికి తరలించారు. శుక్రవారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా, నగరపాలక సంస్థలో సీపీఎం ఫ్లోర్‌లీడర్‌ బోయి సత్యబాబు ఒక ప్రకటనలో గోవిందరాజులు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Updated Date - 2022-08-19T05:57:52+05:30 IST