జగ్గయ్యపేట మున్సిపాలిటీలో టీడీపీ, వైసీపీ మధ్య పోటాపోటీ

ABN , First Publish Date - 2021-11-17T17:39:34+05:30 IST

కృష్ణా జిల్లా జగయ్యపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మధ్య పోటా పోటీ నెలకొంది.

జగ్గయ్యపేట మున్సిపాలిటీలో టీడీపీ, వైసీపీ మధ్య పోటాపోటీ

విజయవాడ: కృష్ణా జిల్లా జగయ్యపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మధ్య పోటా పోటీ నెలకొంది. జగయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కౌంటింగ్ సెంటర్ వద్ద హాల్‌చల్ చేశారు. 13వ వార్డులో టీడీపీకి మెజార్టీ రావడంతో మళ్ళీ రీ కౌంటింగ్‌ చేయాలని ఉదయభాను డిమాండ్ చేశారు. కౌంటింగ్ సెంటర్‌కు ఎమ్మెల్యే సామినేని ఉదయభాను రావడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ ఏజెంట్లను బెదిరింపు ధోరణిలో ఉదయభాను వ్యహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. మరోవైపు జగ్గయ్యపేట మున్సిపాలిటీలో మొత్తం 31 వార్డులకు గాను... 16వార్డుల కౌంటింగ్ పూర్తి అయ్యింది. 16వార్డుల్లో 8 వార్డులను టీడీపీ కైవసం చేసుకుంది. అలాగే 8 వార్డులో వైసీపీ విజయం సాధించింది. 

Updated Date - 2021-11-17T17:39:34+05:30 IST