Vijayawadaలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటం

ABN , First Publish Date - 2022-07-05T03:13:03+05:30 IST

నగరంలో ప్రజల ఆరోగ్యంతో వ్యాపారులు చెలగాటమాడుతున్నారు. చనిపోయిన గొర్రెల మాంసాన్ని..

Vijayawadaలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటం

విజయవాడ (Vijayawada): నగరంలో ప్రజల ఆరోగ్యంతో వ్యాపారులు చెలగాటమాడుతున్నారు. చనిపోయిన గొర్రెల మాంసాన్ని మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. నిల్వ ఉంచిన మాసం ఉంచిన మాంసాన్ని కూడా రూ.800లకు కిలో చొప్పున అమ్ముతున్నారు. సమాచారం అందుకున్న  వెటర్నరీ అసిస్టెంట్‌ ఏ.రవిచంద్ మాంసం దుకాణాలపై దాడులు నిర్వహించారు. నిల్వ ఉంచిన మాంసం అమ్ముతున్నట్లు గుర్తించారు.


భూపేష్‌ గుప్తానగర్‌కు చెందిన వ్యాపారులు శ్రీహరి మాణిక్యం, ఓబులేశ్వరరావుపై కేసు నమోదు చేశారు.  వినుకొండ సంతలో చనిపోయిన గొర్రెలను రూ.2 వేలలు చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు.  కృష్ణలంక రాణిగారి తోటలో 5 షాపుల్లో చనిపోయిన గొర్రెల మాంసం విక్రయిస్తున్నట్లు నిర్ధారించారు. 


Updated Date - 2022-07-05T03:13:03+05:30 IST