విజయవాడ చిన్నారికి మంకీపాక్స్ కాదని నిర్ధారణ

ABN , First Publish Date - 2022-07-18T00:47:18+05:30 IST

విజయవాడ: విజయవాడ చిన్నారికి మంకీపాక్స్ (Monkeypox) కాదని నిర్ధారణ అయింది. దుబాయ్ (Dubai) నుంచి వచ్చిన ఓ కుటుంబంలో

విజయవాడ చిన్నారికి మంకీపాక్స్ కాదని నిర్ధారణ

విజయవాడ: విజయవాడ చిన్నారికి మంకీపాక్స్ (Monkeypox) కాదని నిర్ధారణ అయింది. దుబాయ్ (Dubai) నుంచి వచ్చిన ఓ కుటుంబంలో చిన్నారికి మంకీ పాక్స్ సోకినట్లు తొలుత వైద్యులు (Doctors) అనుమానించారు. చిన్నారి శరీరంపై దద్దుర్లు రావడంతో ఆ కుటుంబాన్ని ఐసోలేషన్‌ (Isolation)లో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నారు. పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌కు చిన్నారి శాంపిల్స్ (samples) పంపించారు. చిన్నారితోపాటు కుటుంబసభ్యులకు చెందిన నమూనాలను కూడా ల్యాబ్‌కు పంపినట్లు డాక్టర్లు చెప్పారు. పరీక్షల్లో మంకీపాక్స్ నెగెటివ్‌గా తేలిందని జీజీహెచ్ సూపరింటెండెంట్ నాగేశ్వరరావు వెల్లడించారు. 


యూఏఈ నుంచి కేరళకు వచ్చిన ఓ రోగి ప్రస్తుతం తిరువనంతపురంలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ రోగికి మంకీపాక్స్ సోకిందని తేలడంతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. నిపుణులను తిరువనంతపురానికి పంపింది. అన్ని రాష్ట్రాలనూ అప్రమత్తం చేసింది. 

Updated Date - 2022-07-18T00:47:18+05:30 IST