
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం విజయవాడలో వైస్సార్ తల్లీ బిడ్డా ఎక్సప్రెస్ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవుడి దయతో మంచి కార్యక్రమం చేస్తున్నామన్నారు. ప్రతి అక్కకు, చెల్లెకి మంచి చేయడం ప్రభుత్వ ఉద్దేశ్యమని, అక్క, చెల్లెలు గర్భవతిగా ఉన్నప్పటి నుంచి బిడ్డకు జన్మ ఇచ్చే వరకు అన్ని సేవలు అందిస్తున్నామన్నారు. ప్రసవం అయిన మహిళ విశ్రాంతిలో ఉన్నప్పుడు ఆర్ధిక సాయం కూడా అందిస్తున్నామని చెప్పారు. గతంలో అరకొర వసతులతో వాహనాలు ఉండేవని, గర్భిణీ స్త్రీలు వెళ్లే వాహనాలు మధ్యలో నిలిచిపోయేవని అన్నారు. దీంతో మెరుగైన సేవలు అందించి అధునాతన వాహనాలు ప్రవేశపెడుతున్నామన్నారు. నాడు-నేడు కింద ఆస్పత్రుల్లో వసతులు కల్పిస్తున్నామని సీఎం జగన్ చెప్పారు.