డాక్టర్ వరుణ్ కార్డియాక్ సైన్స్ ఆసుపత్రిని ప్రారంభించిన AP Governor

ABN , First Publish Date - 2022-05-08T18:09:03+05:30 IST

డాక్టర్ వరుణ్ కార్డియాక్ సైన్సెస్ హాస్పటల్‌ను ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రారంభించారు.

డాక్టర్ వరుణ్ కార్డియాక్ సైన్స్ ఆసుపత్రిని ప్రారంభించిన AP Governor

విజయవాడ: డాక్టర్ వరుణ్ కార్డియాక్ సైన్సెస్ హాస్పటల్‌ను ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్, మేయర్ భాగ్యలక్ష్మి, వైద్య నిపుణులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ డాక్టర్ వరుణ్ కార్డియాక్ సైన్స్ ఆసుపత్రిని ప్రారంభించటం సంతోషంగా ఉందన్నారు. 2017 నుంచి కీ హోల్ సర్జరీ తెలుగు ప్రజలకు వరుణ్ అందుబాటులోకి తెచ్చారన్నారు. బైపాస్ సర్జరీ కాకుండా కీ హోల్ సర్జరీ ద్వారా గుర్తింపు పొందారని కొనియాడారు. అతి తక్కువ కాలంలో వంద ఆపరేషన్లను విజయవంతంగా చేయడం అభినందనీయమన్నారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించి ఆదర్శంగా నిలిచారన్నారు. అత్యాధునిక వైద్య సేవలను ప్రజలకు చేరువ చేశారని, ప్రపంచీకరణ నేపథ్యంలో వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు ఆయుష్ మాన్ భారత్ ద్వారా సామాన్య ప్రజలకు మెరుగైన  వైద్య సేవలు అదిస్తున్నాయని, డాక్టర్ వరుణ్.. పేద, మధ్య  తరగతి  ప్రజలకు మరిన్ని సేవలు  అందిచాలని కోరుతున్నానని గవర్నర్  బిశ్వభూషణ్ వ్యాఖ్యానించారు.



Read more