Vijayawada: చలో Raj Bhavan కార్యక్రమంలో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-06-02T21:53:40+05:30 IST

విజయవాడలో ఛలో రాజ్‌భవన్ కార్యక్రమంలో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

Vijayawada: చలో Raj Bhavan కార్యక్రమంలో ఉద్రిక్తత

Vijayawada: నగరంలో సీపీఐ, దళిత, ప్రజాసంఘాల ఛలో రాజ్‌భవన్ (Raj Bhavan) కార్యక్రమంలో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఏపీ (AP)లో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందంటూ సీపీఐ, ప్రజా సంఘాల నేతలు దుమ్మెత్తిపోశారు. ఈ సందర్బంగా నేతలు, కార్యకర్తలు సీపీఐ కార్యాలయం నుంచి రాజ్‌భవన్‌కు ర్యాలీగా బయలుదేరారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య కొద్దిసేపు వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. దీంతో ఆందోళన కారులను పోలీసులు అరెస్టు చేశారు. సీపీఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణతో సహా పలువురు నేతలను అరెస్టు చేశారు. సీఎం జగన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ రామకృష్ణ దుయ్యబట్టారు. కుల, మత, విద్వేషాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రోజు రోజుకు దిగజారుతున్న పరిస్థితులను గవర్నర్‌కు వివరించేందుకే ఇవాళ ఈ యాత్ర చేపట్టామని తెలిపారు.

Updated Date - 2022-06-02T21:53:40+05:30 IST