విజయవాడ: కార్పొరేట్ సంస్థల అనుకూల లేబర్ కోడ్స్‌ని తిరస్కరిస్తూ.. ప్రైవేట్ వ్యక్తులకు, సంస్థలకు ప్రభుత్వ రంగ సంస్థల్ని కానుకగా కట్టబెట్టే విధానాన్ని వ్యతిరేకిస్తూ సోమ, మంగళవారం రెండు రోజులు కార్మిక సంఘాలు దేశ వ్యాప్తంగా సమ్మెకు పిలుపిచ్చాయి. ఇందులో భాగంగా విజయవాడ రథం సెంటర్ నుంచి, లెనిన్ సెంటర్ వరకు వందలాది మంది కార్మికులు భారీ ప్రదర్శన చేపట్టారు. అనంతరం కార్మిక సంఘాల నేతలు బహిరంగ సభ నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ అమలు చేసే ప్రజా వ్యతిరేక విధానాలను వివరించనున్నారు.
ఇవి కూడా చదవండి