కార్పొరేషన్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు: బత్తిన శ్రీనివాసులు

ABN , First Publish Date - 2021-03-06T21:55:00+05:30 IST

విజయవాడలో కార్పొరేషన్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటాన్నామని విజయవాడ పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు పేర్కొన్నారు.

కార్పొరేషన్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు: బత్తిన శ్రీనివాసులు

విజయవాడ:  విజయవాడలో కార్పొరేషన్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని విజయవాడ పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు పేర్కొన్నారు. శనివారం కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ.. 1870 మంది రౌడీషీటర్స్‌పై 110, 109  సెక్షన్స్ కింద కేసు పెట్టి బైండోవర్ చేశాం. మూడు వేల మంది పోలీసులను ఎన్నికల విధులకు ఉపయోగిస్తున్నాం. మొబైల్ పార్టీలు 62, స్టైకింగ్ ఫోర్సు 27, స్పెషల్ స్టైకింగ్ ఫోర్సు 12 తో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. సమస్యత్మక ప్రాంతాల్లో నిత్యం ఫ్లాగ్ మార్చింగ్ చేస్తున్నారు. మద్యం, నగదు పంపిణీ జరగకుండా అడ్డుకునేందుకు ప్రత్యేకంగా ఎస్ఈబీతో పాటు లోకల్ పోలీసులతో పగడ్బందీగా ఏర్పాట్లు చేశాం.


ఎన్నికల్లో నగదును కొత్త విధానంలో అభ్యర్థులు పంపిణీ చేస్తున్నారు. ఫోన్‌ పే, గోగులో పే, పేటీయం ద్వారా నగదు పంపిణీ చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. అలాంటి వాటిపై ప్రత్యేకంగా సైబర్ నిఘాను పెట్టాం. పోలీసులు ఎక్కడ  ఏ పార్టీకు కొమ్ముకాయరని చెప్పారు. ఏ పార్టీ వాళ్లు వచ్చిన తమకు అన్యాయం జరుగుతుందని, బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేసిన వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. ఓటర్లు కాని, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కాని ఎలాంటి ఇబ్బంది కలిగిన డయిల్ 100 ఫోన్ చేస్తే వెంటనే స్పందిస్తామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2021-03-06T21:55:00+05:30 IST