బైక్‌ను ఢీకొన్న కారు...ఒకరు మృతి

Sep 27 2021 @ 08:45AM

విజయవాడ: కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం  పెద్ద అవుటపల్లి జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. బైక్‌ను కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బైక్‌పై ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా..మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలిసిన వెంటనే ఆత్కూరు ఎస్ఐ శ్రీనివాసరావు తమ బృందంతో  సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు గుంటూరు జిల్లా కొల్లూరు గ్రామానికి చెందిన సాయికుమార్‌గా గుర్తించారు. సాయి కుమార్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.