Vijaykanth ఆరోగ్యంపై ప్రధాని వాకబు

ABN , First Publish Date - 2022-06-24T14:03:58+05:30 IST

డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌ ఆరోగ్యం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అడిగి తెలుసుకున్నారు. నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న

Vijaykanth ఆరోగ్యంపై ప్రధాని వాకబు

ప్యారీస్‌(చెన్నై), జూన్‌ 23: డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌ ఆరోగ్యం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అడిగి తెలుసుకున్నారు. నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విజయకాంత్‌కు మధుమహేం కారణంగా కుడికాలు మూడు వేళ్లను తొలగించినట్లు ఆ పార్టీ ప్రకటన విడుదల చేసింది. విజయకాంత్‌ ఆరోగ్యంగా కోలుకోవాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, నటుడు రజనీకాంత్‌, ఎంఎన్‌ఎం అధ్యక్షుడు కమల్‌హాసన్‌, నటుడు సత్యరాజ్‌ సహా పలువురు ప్రకటన విడుదల చేశారు.  ఈ నేపథ్యంలో, ప్రధాని మోదీ, విజయకాంత్‌ సతీమణి ప్రేమలతకు ఫోన్‌ చేసి విజయకాంత్‌ ఆరోగ్య పరిస్థితి, ఆయనకు అందిస్తున్న చికిత్సా వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే, విజయకాంత్‌ సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగిరావాలని ప్రధాని మోదీ తెలిపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 

Updated Date - 2022-06-24T14:03:58+05:30 IST