టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడిపై విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-02-28T23:37:45+05:30 IST

టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడిపై విజయసాయిరెడ్డి ఘాటైన వ్యాఖలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ హంతకుడని..

టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడిపై విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు

విశాఖ: టీడీపీ ఎమ్మెల్యే  వెలగపూడిపై విజయసాయిరెడ్డి ఘాటైన వ్యాఖలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ హంతకుడని ఆయన ఆరోపించారు. విజయవాడలో హత్యచేసి విశాఖకు పారిపోయి వచ్చాడని ఓ ప్రకటనలో తెలిపారు. విశాఖను పరిపాలన రాజధాని కాకుండా ఎమ్మెల్యే వెలగపూడి అడ్డుకుంటున్నాడని వ్యాఖ్యానించారు. వెలగపూడి నుంచి సమస్యలు వస్తే ఫిర్యాదు చేయాలని, విశాఖ నుంచి తరిమికొడదామని విజయసాయిరెడ్డి సూచించారు. 


Updated Date - 2021-02-28T23:37:45+05:30 IST