సామర్లకోట,
జూలై 4: కంచి జగద్గురువులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామిజీ సోమవారం
రాత్రి కాకినాడ జిల్లా సామర్లకోటకు చేరుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో
వచ్చి స్వామిజీపై పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. జిల్లాలో
ఆరురోజుల పర్యటన కోసం ఏలూరు నుంచి ప్రత్యేక వాహనంలో సామర్లకోట గాంధీబొమ్మ
సెంటర్కు చేరుకోగా కంచి మహాసంస్థానం సామర్లకోట నిర్వాహకులు చంద్రాభట్ల
పతంజలిపద్మ, మట్టే శ్రీనివా్సవిద్యుల్లత పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
గాంధీబొమ్మ సెంటర్ నుంచి గణపతిశాస్త్రి ఇంటివరకూ భక్తులు పాల్గొన్నారు.
సామర్లకోట తహశీల్దార్ వజ్రపు జితేంద్ర పండ్లు, పూలదండలు చేతికందించి
నమస్కరించి స్వాగతం పలికారు. జిల్లా దేవదాయాధికారి పులి నారాయణమూర్తి
హాజరయ్యారు. విజయేంద్ర సరస్వతి స్వామీజీ సామర్లకోట గణపతిశాస్త్రి ఇంటి
వద్దే బస చేస్తూ ఆరు రోజులు పాటు పెద్దాపురం, అచ్చంపేట గోశాలలో నిర్వహించే
పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పెద్దాపురం సీఐ
అబ్దుల్నబీ, సామర్లకోట ఎస్ఐ టి.సునీత బందోబస్తు నిర్వహించారు.