Vikarabadలో భారీ అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2022-07-02T13:15:40+05:30 IST

జిల్లాలోని కుల్కచర్ల మండల కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

Vikarabadలో భారీ అగ్నిప్రమాదం

వికారాబాద్: జిల్లాలోని కుల్కచర్ల మండల కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. చంద్రలింగం అనే వ్యక్తికి చెందిన బట్టల షాపులో శనివారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. అయితే ఫైర్ ఇంజన్ వచ్చేలోపే దుకాణం పూర్తిగా కాలిపోయింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలిస్తున్నారు. దాదాపు కోటి రూపాయల ఆస్థి నష్టం జరిగి ఉంటుందని షాపు యజమాని తెలిపాడు. కాగా... అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Updated Date - 2022-07-02T13:15:40+05:30 IST