
వికారాబాద్: బుధవారం అర్ధరాత్రి పూడూర్లో కాల్పుల కలకలం రేగింది. అటవీప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు గాల్లోకి కాల్పులు జరిపినట్లు స్థానికులు గుర్తించారు. మొత్తం నాలుగు రౌండ్లు కాల్పులు జరపడంతో పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే దుండగులు పారిపోయారు. వేటగాళ్ల పనే అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. అటవీప్రాంతంలో గాలించారు. పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అనుమానితుల సమాచారం ఇవ్వాలని స్థానికులకు సూచించారు.
ఇవి కూడా చదవండి