మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ ఇంటి వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Published: Sat, 23 Apr 2022 12:38:01 ISTfb-iconwhatsapp-icontwitter-icon

వికారాబాద్: పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఇంటి వద్ద సేవ్యానాయక్ అనే వ్యక్తి పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కాంగ్రెస్ కౌన్సిలర్ కారు దహనం కేసులో తనపై  రామ్మోహన్ రెడ్డి నిందలు వేశాడంటూ సేవ్యాన్యాయక్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఓ టీవీ చానల్ డిబెట్లో సేవ్యానాయక్ పేరును రామ్మోహన్ రెడ్డి నేరుగా ప్రస్తావించాడు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలతో వారే కారు తగులబెట్టుకొని తనను అవమానించాడంటూ ఆవేదన చెందుతూ సేవ్యానాయక్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. వెంటనే అతడిని  స్థానికులు హుటాహుటిన పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తలించారు. వైద్యం చేయించుకునేందుకు సేవ్యానాయక్ సహకరించలేదు. ఈ క్రమంలో అతడి పరిస్థితి విషమించడంతో వికారాబాద్‌లోని మిషన్ ఆస్పత్రికి తరలించారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.