వికారాబాద్: జిల్లాలోని దోమ మండలం బాసుపల్లి సమీపంలో మంగళవారం ఓ ఆటో బోల్తా పడింది. కుక్కను తప్పించబోయి ఆటో అదుపుతప్పి బోల్తా పడినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఆరుగురిలో నలుగురికి గాయాలవగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే క్షతగాత్రులను పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.