Vikarabad: నకిలీ పత్తి విత్తనాలతో నష్టపోయిన రైతులు

ABN , First Publish Date - 2021-12-20T14:42:13+05:30 IST

జిల్లాలోని పూడూరు మండలం సిరిగాయపల్లిలో నకిలీ పత్తి విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

Vikarabad: నకిలీ పత్తి విత్తనాలతో నష్టపోయిన రైతులు

వికారాబాద్: జిల్లాలోని పూడూరు మండలం సిరిగాయపల్లిలో నకిలీ పత్తి విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.  అంకర్ కంపెనీ విక్టర్ బిజి 2 పత్తి విత్తనాలు వాడమంటూ రైతులను ఫర్టిలైజర్ షాపు యజమాని  ప్రోత్సహించాడు. నమ్మిన రైతులు పత్తి విత్తనాలను వాడారు. అయితే ఐదు నెలలుగా పత్తి పంట చేతికి రాకపోవడంతో  రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏపుగా పెరిగినా పూత కాత ఆశించిన స్థాయిలో రాలేదని రైతులు నిరాశ చెందుతున్నారు. కంపెనీపై చర్యలు తీసుకోవాలని... తమను ఆదుకోవాలని  రైతులు వేడుకుంటున్నారు. 

Updated Date - 2021-12-20T14:42:13+05:30 IST