ఆదివారాల్లో సంపూర్ణ Lockdown వద్దు: విక్రమ్‌రాజా

ABN , First Publish Date - 2022-01-22T14:47:45+05:30 IST

కరోనా కాలంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు వ్యాపారులకు ఎలాంటి సాయం చేయలేదని వాణియంబాడి వ్యాపారుల సంఘ పేరవై రాష్ట్ర అధ్యక్షుడు విక్రమ్‌రాజా ఆరోపించారు. వాణియంబాడి వ్యాపారుల సంఘం తరఫున

ఆదివారాల్లో సంపూర్ణ Lockdown వద్దు: విక్రమ్‌రాజా

వేలూరు(చెన్నై): కరోనా కాలంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు వ్యాపారులకు ఎలాంటి సాయం చేయలేదని వాణియంబాడి వ్యాపారుల సంఘ పేరవై రాష్ట్ర అధ్యక్షుడు విక్రమ్‌రాజా ఆరోపించారు. వాణియంబాడి వ్యాపారుల సంఘం తరఫున గురువారం నిర్వహించిన వేడుకల్లో విక్రమ్‌రాజా పాల్గొన్నారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ నిబంధనల పేరిట వ్యాపారులకు జరిమానా విధించడాన్ని ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రప్రభుత్వం ఇటీవల పంపిణి చేసిన పొంగల్‌ సరుకులను ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయడంతో వారు నాణ్యత లేనివి సరఫరాచేశారని తెలిసిందన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం రాష్ట్ర వ్యాపారుల నుండే సరుకులు కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారాల్లో విధిస్తున్న లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలు శనివారాల్లో భారీగా దుకాణాలకు వచ్చి సరుకులు కొను గోలు చేస్తున్నారని, దీంతో కరోనా ప్రబలే అవకాశముందని, దీనిని పరిగణలోకి తీసుకొని ఆదివారాల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ను ప్రభుత్వం విరమించుక ోవాలని విక్రమ్‌రాజా కోరారు. వాణియంబాడి అన్నాడీఎంకే ఎమ్మెల్యే సెంథిల్‌కుమార్‌, తిరుపత్తూర్‌ జిల్లా సెక్రటరీ మాదేశ్వరన్‌, మండల అధ్యక్షుడు కృష్ణన్‌, పలు జిల్లాల ఆర్గనైజర్లు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-22T14:47:45+05:30 IST