సంచలనాల దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఇటీవల షూటింగ్ ప్రారంభించుకున్న చిత్రం 'పుష్ఫ'. రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రంగా రూపుదిద్దుకుంటోంది. అయితే ఈ సినిమాలో ముందు తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కూడా ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడని అధికారికంగా వార్తలు వచ్చాయి. అయితే కరోనా గ్యాప్‌తో డేట్స్ క్లాష్ అవ్వడంతో విజయ్ సేతుపతి ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లుగా ప్రకటించారు. ఆ తర్వాత ఆ పాత్రలో ఇద్దరు ముగ్గురు నటుల పేర్లు వినిపించాయి. ఉపేంద్ర, సుదీప్, ఆర్య వంటి వారి పేర్లు వినిపించాయి.
తాజాగా ఈ పాత్ర కోసం విలక్షణ నటుడు విక్రమ్‌ను చిత్రయూనిట్ సంప్రదిస్తున్నట్లుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. విక్రమ్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. తన పాత్ర కోసం ప్రాణం పెట్టే హీరోల్లో విక్రమ్ ఒకరు. అది ఆయన నటించిన చిత్రాలే చెబుతాయి. ఇక విక్రమ్ ఈ చిత్రంలో అనగానే సినిమాపై మరింతగా అంచనాలు పెరగడం ఖాయం. అయితే ఈ న్యూస్ ఎంత వరకు నిజమనేది తెలియాలంటే.. సుక్కు అండ్ టీమ్ స్పందించాల్సిందే.