విక్రమ్ Cobra థియేటర్స్‌కీ వచ్చేది ఆ రోజే

Published: Fri, 20 May 2022 20:58:59 ISTfb-iconwhatsapp-icontwitter-icon
విక్రమ్ Cobra థియేటర్స్‌కీ వచ్చేది ఆ రోజే

బాక్సాఫీస్ హిట్‌లతో సంబంధం లేకుండా విలక్షణ పాత్రలు పోషించే నటుడు చియాన్ విక్రమ్ (Chiyaan Vikram). ఈ ఏడాది ‘మహాన్’ (Mahaan) సినిమాతో అభిమానులను అలరించాడు. ఈ చిత్రానికీ ప్రేక్షకుల మన్ననలతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. విక్రమ్ నటించిన తాజా చిత్రం ‘కోబ్రా’ (Cobra). ఈ సినిమా విడుదల తేదీ వచ్చేసింది. 


‘కోబ్రా’ కు అజయ్ జ్ఞానముత్తు (Ajay Gnanamuthu ) దర్శకత్వం వహించాడు. ఏఆర్. రెహమాన్(AR Rahman) సంగీతం అందించాడు. ఈ సినిమా ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్ర బృందం ఓ వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో విక్రమ్ లుక్స్, నేపథ్య సంగీతం ఆకట్టుకునేలా ఉన్నాయి. గతంలో ఈ సినిమాను మే 26న విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, ఇర్ఫాన్ ఖాన్, రోషన్ అండ్రూస్, మృణాళిని రవి, కేఎస్. రవికుమార్, పద్మ ప్రియ, మియా జార్జ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 7స్ర్ర్కీన్ స్టూడియో నిర్మించిన ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాలో విక్రమ్ గణిత శాస్త్రవేత్తగా కనిపించడంతో పాటు దాదాపుగా 20రకాల విభిన్న గెటప్పులతో సందడిచేయనున్నట్టు సమాచారం. ఈ మూవీలోని కొన్ని సీన్స్‌ను మార్చి 2020లో రష్యాలో చిత్రీకరించాలనుకున్నారు. 15రోజుల షెడ్యూల్ కోసం ఆ దేశానికి వెళ్లారు. ఆ సమయంలోనే కరోనా వచ్చింది. దీంతో చిత్ర బృందం షూటింగ్‌ను రద్దు చేసుకుని అనివార్యంగా ఇండియాకు వచ్చింది. Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International