‘రెవెన్యూ’ మది నిండా సేవాభావం

ABN , First Publish Date - 2020-12-02T06:08:38+05:30 IST

రెవెన్యూ ఉద్యోగులు పగలనక, రేయనక సేవాభావంతో పనిచేస్తారని జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ అన్నారు.

‘రెవెన్యూ’ మది నిండా సేవాభావం
విక్టర్‌పాల్‌ను సత్కరిస్తున్న కలెక్టర్‌ ఇంతియాజ్‌

మచిలీపట్నం టౌన్‌ : రెవెన్యూ ఉద్యోగులు పగలనక, రేయనక సేవాభావంతో పనిచేస్తారని జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ అన్నారు. కలెక్టరేట్‌ కార్యాలయ సూపరింటెండెంట్‌, డీఎస్‌వో కార్యాలయ డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన సందర్భంగా డా. విక్టర్‌పాల్‌ను మంగళవారం స్థానిక రెవెన్యూ కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్‌ ఘనంగా సత్కరించి ప్రసంగించారు. విధి నిర్వహణలో రెవెన్యూ ఉద్యోగులు అప్రమత్తంగా ఉంటారని, అందుకు విక్టర్‌పాల్‌ ఉదాహరణగా మిగిలిపోయారన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ డా. మాధవీలత మాట్లాడుతూ, సివిల్‌ సప్లయీస్‌ విభాగంలో లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు రేషన్‌ బియ్యం పంపడం వంటి కార్యక్రమాలకు విక్టర్‌పాల్‌ అడిగిన వెంటనే గణాంక వివరాలు అందించేవారన్నారు. ఈ కార్యక్రమంలో ఆసరా జాయింట్‌ కలెక్టర్‌ మోహనకుమార్‌, డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవో ఖాజావలి, గుడివాడ ఆర్డీవో జి. శీనుకుమార్‌, జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌, కలెక్టరేట్‌ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్యామ్‌నాథ్‌ గౌడ్‌,  శ్రీనివాస గౌడ్‌, సత్యనారాయణ, పద్మరోజా పాల్గొన్నారు.

 ప్రాచీన రికార్డుల భద్రతపై చర్యలు తీసుకోవాలి 

 కలెక్టరేట్‌కు రెండు శతాబ్దాల చరిత్ర ఉందని, ఈ రికార్డులు భద్రపరిచేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్‌ ఇంతియాజ్‌, జేసీ మాధవీలత, ఆర్డీవో ఖాజావలితో కలసి రికార్డు రూములను పరిశీలించారు. 


Updated Date - 2020-12-02T06:08:38+05:30 IST