గ్రామాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు

ABN , First Publish Date - 2022-01-22T06:39:58+05:30 IST

గ్రామాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు

గ్రామాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు
నున్నలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది

విజయవాడ రూరల్‌, జనవరి 21 : జిల్లాలో కరోనా వైరస్‌ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో వైద్య, ఆరోగ్యశాఖ గ్రామాల్లో కరోనా పరీక్షల ప్రక్రియను ప్రారంభించింది. జీ కొండూరు మండలం వెలగలేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) పరిధిలో నున్న లైబ్రరీ వద్ద శుక్రవారం కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. పీహెచ్‌సీ వైద్యాధికారులు  కె కిశోర్‌, మాధురీదేవి పర్యవేక్షణలో పరీక్షలు జరిగాయి. తొలుత మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ యర్కారెడ్డి నాగిరెడ్డికి వైద్యాధికారులు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. నున్న పరిసర ప్రాంతాల్లో జ్వరం, జలుబు, తదితర లక్షణాలతో ఉన్న వారంతా కరోనా నిర్దార ణ పరీక్షల కోసం ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా భావించి ల్యాబ్‌ల నిర్వాహకులు వేలాది రూపాయలను గుంజుతున్నారు. దీనిపై పత్రికల్లో వార్తలు ప్రచురితంకావడంతో పీహెచ్‌సీల పరిధిలోని అన్ని గ్రామాల్లోనూ కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. అందులో భాగంగానే నున్నలో తొలి రోజున 38 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారులు కిరణ్‌, మాధురీదేవి తెలిపారు. రెండో రోజైన శనివారం రామవరప్పాడు, ప్రసాదంపాడులో టెస్ట్‌లను నిర్వహించనున్నట్లు తెలిపారు.   ప్రభు త్వ ఆదేశాల మేరకు ఆర్‌టీపీసీఆర్‌ టెస్ట్‌లను రూ.350కే చేయాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఈవో ఎం కోటేశ్వరరావు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-22T06:39:58+05:30 IST