గ్రామాల అభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యం

ABN , First Publish Date - 2022-06-27T06:26:23+05:30 IST

గ్రామాలలో అభివృద్ధి జరిగింది అంటే అది కేవ లం టీఆర్‌ఎస్‌ ద్వారానే సాధ్యమైందని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ అన్నారు.

గ్రామాల అభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యం
అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తున్న ఎమ్మెల్యే

ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌

బీర్‌పూర్‌, జూన్‌ 26: గ్రామాలలో అభివృద్ధి జరిగింది అంటే అది కేవ లం టీఆర్‌ఎస్‌ ద్వారానే సాధ్యమైందని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ అన్నారు. బీర్‌పూర్‌ గ్రామంలో డీఎంఎఫ్‌టీ నిధుల ద్వారా 18.40 లక్షలతో నిర్మించిన కల్యాణ మండపాన్ని ఆదివారం ప్రారంభించారు. అనంతరం వైకుంఠదామం ప్రారంభించి బేతాల విగ్రహ ప్రతిష్ఠ సందర్బంగా బేతా ళున్ని దర్శించుకున్నారు. కేతేస్వారా స్వామి కంకాలమ్మ జాతరలో పాల్గొ న్నారు. అనంతరం బీర్‌పూర్‌ మండల ఆర్‌ఎంపీ, పిఎంపీల సమా వేశం లో పాల్గొన్నారు. తుంగూర్‌ గ్రామంలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా 82 లక్షలతో పాఠశాల అభివృద్ధి పనులకు భూమి చేసి అదనపు తరగతి గదుతను ప్రారంభించి గ్రామంలోని పల్లే ప్రకృతి వనం, వైకుంఠ దామం, కంపోస్టు షెడ్డులను ప్రారంభించారు. అదేవిధంగా కోమ న్‌పల్లి, చిన్న కొల్వాయి గ్రామంలో పల్లే ప్రకృతి వనం, వైకుంఠ ధామం, కంపోస్టు షేడుడ్లను ప్రారంభించారు. పలు గ్రామాలలో సిఎం సహాయ నిధి, కల్యాణ లక్ష్మీ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్బం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాల ప్రజలను దృష్టి లో ఉంచుకొని అభివృద్ధే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారని అన్నారు. రా ష్ట్రంలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా 7వేల కోట్ల నిధు లు మంజూరు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎం పీపీ మసర్తి రమేష్‌, జడ్పీటీసీ పాత పద్మ రమేష్‌, వైస్‌ ఎంపీపీ లక్ష్మన్‌రావ్‌, కేడిసీసీ జిల్లా మెంబర్‌ రాంచంధర్‌ రావ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు రమేష్‌, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు మహిపాల్‌ రెడ్డి, సర్పంచ్‌లు పా ల్గొన్నారు. అనంతరం నర్సింహులపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు చెరుపూరి సుభాష్‌ యాదవ్‌ తండ్రి ఆదివారం ఉద యం మరణించగా ఎమ్మెల్యే మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

Updated Date - 2022-06-27T06:26:23+05:30 IST