Advertisement

పల్లె పోరుకు సై

Jan 24 2021 @ 01:09AM

జిల్లా అధికారుల నుంచి రాని ఎన్నికల షెడ్యూల్‌ 

జూమ్‌ యాప్‌ ద్వారా స్టేజ్‌-1 అధికారులకు శిక్షణ ఇచ్చిన సీఈవో

సరంజామా సిద్ధం చేసుకునే పనిలో ఎన్నికల అధికారులు  

 తొలి విడతలో అమలాపురం డివిజన్‌లో పంచాయతీ ఎన్నికలు

పంచాయతీల్లో ప్రదర్శితం కాని ఎన్నికల షెడ్యూల్‌

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ శనివారం విడుదలైంది. తొలి విడతలో అమలాపురం రెవెన్యూ డివిజన్‌లో పంచాయతీ ఎన్నికల నిర్వహ ణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. దాంతో అధికారులు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. జిల్లా యంత్రాంగం పంచా యతీ ఎన్నికలకు క్లియరెన్సు ఇవ్వకపోవడంతో ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్‌ను అమలాపురం డివిజన్‌ పరిధిలోని పంచాయతీల్లో ఎక్కడా ప్రదర్శించలేదు. జిల్లా అధికారుల కార్యాలయాల నుంచి ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కాకపోవడంతో ఉద్యోగుల్లో సందిగ్ధత శనివారం రాత్రికి కూడా కొనసాగుతూనే ఉంది. పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టులో ప్రభుత్వం వేసిన పిటిషన్‌ సోమవారం విచారణకు రానున్న నేపథ్యంలో అటు పంచా యతీ పాలకవర్గాలపై ఆశలు పెంచుకున్న సభ్యుల్లోను, ఇటు ఎన్నికల సిబ్బందిలోను గందరగోళ పరిస్థితి కొనసాగుతూనే ఉంది. అయితే కొన్ని మండలాల్లో పంచాయతీ ఉద్యోగులు కోడ్‌ అమలు చేయడంపై దృష్టి సారిం చారు. ఆయా పంచాయతీల పరిధిలో ఉన్న నేతల విగ్రహాలకు ముసుగులు వేసే పని చేపట్టారు. అమలాపురం రూరల్‌ మండల పరిధిలోని బండారు లంక, మండల కేంద్రమైన అంబాజీపేట, ఇలా పలుచోట్ల విగ్రహాలకు ముసు గులు వేసి కోడ్‌ అమలుపై భయంభయంగా పంచాయతీ ఉద్యోగులు చర్యలు చేపడుతున్నారు. కొన్నిచోట్ల ఫ్లెక్సీలు తొలగించారు. సిబ్బంది సైతం బ్యాలెట్‌ బాక్సులు, ఇతర ఎన్నికల సామగ్రిని సిద్ధం చేసుకునే పనిలో ఉన్నారు. శని వారం డివిజన్‌ పరిధిలోని పదహారు మండలాల్లో జూమ్‌ యాప్‌ ద్వారా జడ్పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ శిక్షణ నిర్వహించారు. పంచాయతీ ఎన్నిక లకు సంబంధించి ముందుగానే నియమించబడ్డ స్టేజ్‌-1 అధికారులతో ఈ శిక్షణ నిర్వహించారు. శిక్షణ మధ్యలో జిల్లాకలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి జూమ్‌ యాప్‌ ద్వారా ఎన్నికల సిబ్బందితో మాట్లాడారు. అయితే డివిజన్‌ పరిధిలో అయినవిల్లి, ఉప్పలగుప్తం, ఆత్రేయపురం మండలాల నుంచి ఇద్దరేసి వంతున స్టేజ్‌-1 అధికారులు ఎన్నికల శిక్షణకు డుమ్మా కొట్టడంతో ఉన్నతాధికారులు సీరియస్‌ అయ్యారు. జిల్లా కేంద్రం నుంచి అనుమతి లభించిన తరువాత నోటిఫికేషన్‌ కాపీలను మండల పరిషత్‌ కార్యాలయాల ద్వారా పంచాయతీ లకు అందజేయనున్నారు. అయితే స్టేజ్‌-1 అధికారులు మాత్రం ఏ క్షణాన అయినా బాధ్యతలు స్వీకరించి షెడ్యూల్‌ ప్రకారం నామినేషన్ల స్వీకరణకు ఎవరి ఏర్పాట్లలో వారు ఉన్నారు. వివిధ మండలాల్లో పంచాయతీ స్టేజ్‌-1 ఆఫీసర్లతో ఎంపీడీవోలు సమావేశాలు నిర్వహించి పలు సూచనలు ఇచ్చారు. బ్యాలెట్‌ బాక్సులతోపాటు సర్పంచ్‌, వార్డుల రిజర్వేషన్ల వివరాలు, ఎన్నికల్లో నామినేషన్లు వేసే అభ్యర్థులు చెల్లించవలసిన ఫీజులు, వారికి రశీదులు ఇవ్వడం వంటి అంశాలపై జడ్పీ సీఈవో శిక్షణ ఇచ్చారు. కాగా అమలాపురం సబ్‌కలెక్టర్‌ హిమాన్షుకౌశిక్‌, జిల్లా పంచాయతీ అధికారి ఆర్‌ విక్టర్‌లు శని వారం రాత్రి అత్యవసరంగా టెలీకాన్ఫరెన్సు నిర్వహించి పంచాయతీ ఎన్నికల సిబ్బందికి, ఎంపీడీవోలు, తహశీల్దార్లకు పలు సూచనలు చేశారు. స్టేజ్‌-1 అధి కారుల్లో ఈ నెలాఖరు నాటికి పదవీ విరమణచేసేవారు ఎవరైనా ఉన్నారా, బ్యాలెట్‌ బాక్సుల కొరత, సిబ్బంది సర్దుబాట్లు వంటివాటిపై పూర్తి సమా చారాన్ని ఆదివారం నాటికి సిద్ధం చేయాల్సిందిగా సబ్‌కలెక్టర్‌ ఆదేశించారు. ఇక అమలాపురం రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని పదహారు మండలాల్లో ఉన్న 273 గ్రామ పంచాయతీల్లోని సర్పంచ్‌లు, వార్డు సభ్యులతోపాటు 3,232 పోలింగ్‌ స్టేషన్లలో తొలి విడత ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తారు. 

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.