Student, Cycle: గ్రామం కోసం బాలిక సాహసం !

ABN , First Publish Date - 2022-08-04T13:04:02+05:30 IST

నీటివనరుల ఆక్రమణలు తొలగించాలని కోరుతూ 7వ తరగతి విద్యార్థిని(Student) 60 కి.మీ దూరం సైకిల్‌పై వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించింది.

Student, Cycle: గ్రామం కోసం బాలిక సాహసం !

- ఆక్రమణలు తొలగించాలంటూ 70 కి.మీ ప్రయాణం

- కలెక్టర్‌కు వినతిపత్రం అందించిన 7వ తరగతి విద్యార్థిని


పెరంబూర్‌(చెన్నై), ఆగస్టు 3: నీటివనరుల ఆక్రమణలు తొలగించాలని కోరుతూ 7వ తరగతి విద్యార్థిని(Student) 60 కి.మీ దూరం సైకిల్‌పై వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించింది. విల్లుపురం(Villupuram) జిల్లా అన్నాపళం గ్రామంలో 12 ఎకరాల చెరువు ఆక్రమణలకు గురై కుంచించుకోపోయింది. గ్రామంలో తాగు, సాగునీటి అవసరాలకు ప్రధానంగా ఉన్న ఈ చెరువులోని ఆక్రమణలు తొలగించాలంటూ పలువురు గ్రామస్తులు జిల్లా అధికారులకు వినతిపత్రం సమర్పించినా ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో, ఆ గ్రామానికి చెందిన రైతు భువనేశ్వర్‌(Bhubaneswar) కుమార్తె సెమ్మొళి అదే ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. బుధవారం ఉదయం చిన్నగా వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా సెమ్మొళి 60 కి.మీ దూరంలో ఉన్న కలెక్టర్‌(Collector) కార్యాలయానికి సైకిల్‌పై వెళ్లి వినతిపత్రం సమర్పించింది. అధికారులు స్పందించని పక్షంలో సైకిల్‌పై చెన్నై వెళ్లి ముఖ్యమంత్రికి వినతిపత్రంసమర్పిస్తానని సెమ్మొళి తెలిపింది.

Updated Date - 2022-08-04T13:04:02+05:30 IST