బీహార్‌లో దారుణం.. దళిత యువకుడిని ఘోరంగా హింసించిన గ్రామ పెద్ద

ABN , First Publish Date - 2021-12-13T05:55:57+05:30 IST

దేశంలో దళితులపై ఇంకా అవమానాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలైన రాజస్థాన్, బీహార, ఉత్తర్ ప్రదేశ్‌లలో ఇలాంటి ఘటనలు తరుచూ జరుగుతూ ఉంటాయి. తాజాగా బీహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్ జిల్లాలోని ఒక గ్రామ పెద్ద ఇద్దరు దళితులను దారణంగా అవమానించాడు...

బీహార్‌లో దారుణం.. దళిత యువకుడిని ఘోరంగా హింసించిన గ్రామ పెద్ద

దేశంలో దళితులపై ఇంకా అవమానాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలైన రాజస్థాన్, బీహార, ఉత్తర్ ప్రదేశ్‌లలో ఇలాంటి ఘటనలు తరుచూ జరుగుతూ ఉంటాయి. తాజాగా బీహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్ జిల్లాలోని ఒక గ్రామ పెద్ద ఇద్దరు దళితులను దారణంగా అవమానించాడు. అంతటితో ఆగక వారిని చితకబాదాడు. ఈ సంఘటన మొత్తం ఒక వ్యక్తి వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టాడు.


వివరాలిలా ఉన్నాయి..  బీహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్ జిల్లాలో పరిధిలోని ఒక గ్రామంలో బల్వంత్ సింగ్ అనే వ్యక్తి ఇటీవలే పంచాయితీ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయాడు. ఆ పంచాయితీ నియోజకవర్గంలో దళితుల జనాభా ఎక్కువగా ఉండడంతో వారు ఓట్లు వేయకపోవడం వల్లే తాను ఓడిపోయానని బల్వంత్ సింగ్ కోపంగా ఉన్నాడు. 


ఈ క్రమంలో ఇద్దరు దళిత యువకులను బల్వంత్ సింగ్ రోడ్డుపై చితకబాదాడు. "నా వద్ద ఓటుకు వేసేందుకు డబ్బులు తీసుకొని కూడా ఓటు వేయకుండా ఉంటారా.. మీకెంత ధైర్యం రా" అంటూ వారిని బూతులు తిట్టాడు. వారి జాతి, కులం నీచమైనదని అన్నాడు . అంతటితో ఆగక ఆ ఇద్దరు యువకులలో ఒకరిని మెడతో పట్టుకొని మోకాళ్ల మీద కూర్చొబెట్టాడు. ఆ తరువాత నేలపై తను ఊసిన ఉమ్మిని.. ఆ దళిత యువకుడితో నాకించాడు.  ఇదంతా జరుగుతూ ఉండగా.. అక్కడే నిలబడిన ఒక వ్యక్తి వీడియో రికార్డ్ చేశాడు. 


ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు బల్వంత్ సింగ్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 


Updated Date - 2021-12-13T05:55:57+05:30 IST