గ్రామగ్రామాన స్వాతంత్య్ర వజ్రోత్సవాలు

ABN , First Publish Date - 2022-08-11T04:05:01+05:30 IST

జిల్లా వ్యాప్తంగా స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. భారతావణికి స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. యువతలో దేశభక్తిని పెంపొందిస్తూ స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించేలా ప్రణాళికలను రూపొందించింది. ఈ మేరకు ఈ నెల 8 నుంచి22 వరకు పక్షంరోజులపాటు ప్రత్యేకకార్యక్రమాలు నిర్వహించనున్నారు.

గ్రామగ్రామాన స్వాతంత్య్ర వజ్రోత్సవాలు
కెరమెరి జోడేఘాట్‌లో త్రివర్ణ పతాకాలతో కలెక్టర్‌, జడ్పీ చైర్‌పర్సన్‌, ఎమ్మెల్యే తదితరులు

- 75ఏళ్లు పూర్తైన సందర్భంగా వేడుకలు

- ఇంటింటా జాతీయ జెండాల పంపిణీ

- జిల్లా వ్యాప్తంగా ఉత్సవాలు

- ఈనెల 22 వరకు ప్రత్యేక కార్యక్రమాలు

ఆసిఫాబాద్‌, ఆగస్టు 10: జిల్లా వ్యాప్తంగా స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. భారతావణికి స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. యువతలో దేశభక్తిని పెంపొందిస్తూ స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించేలా ప్రణాళికలను రూపొందించింది. ఈ మేరకు ఈ నెల 8 నుంచి22 వరకు పక్షంరోజులపాటు ప్రత్యేకకార్యక్రమాలు నిర్వహించనున్నారు. 

8నుంచి 22 వరకు ప్రత్యేక కార్యక్రమాలు

భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం ఈనెల 8నుంచి 22వరకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రణాళికలను రూపొందించింది. జిల్లా వ్యాప్తంగా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ నేతృత్వంలో అధికారులు, ప్రజాప్రతినిధులు కార్యక్ర మాలను విజయవంతం చేసేలా ముందుకు వెలుతున్నారు. ఇంటింటికి జాతీయ జెండాలను పంపిణీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 50వేల జెండాలను పంపిణీ చేశారు. వేడుకల్లో బాగంగా మంగళవారం పట్టణానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు దండనాయకుల శ్రీనివాస్‌రావు దంపతులను ఘనంగా సన్మానించారు. జిల్లా కేంద్రంలోని సినిమా థియేటర్‌లో గాంధీ సినిమాను కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌, అధికారులు, విద్యార్థులతో కలిసి వీక్షించారు. బుధవారం జిల్లా వ్యాప్తంగా 1.50లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈనెల 11న జిల్లాకేంద్రంతోపాటు ప్రతిమండల కేంద్రంలో 2కే రన్‌ నిర్వహణ, 12న జాతీయ సమైఖ్యత కోసం రక్షాబంధన్‌ నిర్వహణ, 13న ప్రతి గ్రామంలో, మున్సిపాలిటీలో జాతీయ జెండాతో ఫ్రీడం ర్యాలీ, 14న ప్రతి నియోజకవర్గ కేంద్రంలో జానపద కళారుపాల ప్రదర్శన, 15న స్వాతంత్య్ర దినోత్సవం, 16న  సామూహిక జాతీయ గీతాలపాన, 17న రక్తదాన శిబిరాల ఏర్పాటు, 18న జిల్లా వ్యాప్తంగా ఫ్రీడంకప్‌ పోటీలు, 19న ఆస్పత్రులు, వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు, జైళ్లలో పండ్ల పంపిణీ, 20న ముగ్గుల పోటీలు, 21న స్థానికసంస్థల సమావేశాలు, 22న వజ్రోత్సవ ముగింపు వేడుకలు జరుగనున్నాయి.

జిల్లాలో వేడుకలను విజయవంతం చేయాలి

- రాహుల్‌రాజ్‌, కలెక్టర్‌

జిల్లాలో వజ్రోత్సవాల విజయవంతానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కలిసి పనిచేయాలి. వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల22వరకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తాం. ఇంటింట జాతీయ జెండాలను ఎగురవేయాలని ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 50వేల జెండాలను పంపిణీ చేశామన్నారు. వజ్రోత్సవాల్లో ప్రజలు భాగస్వామ్యులు కావాలని కోరారు.

చింతలమానేపల్లి: మండలంలోని కర్జవెల్లి, కేతిని, బాబాసాగర్‌ తదితర గ్రామాల్లో బుధవారం స్వాతంత్య్ర భారత వజ్రోత్సవ కార్యక్రమంలో భాగంగా ఎంపీపీ నానయ్య పాఠశాలల్లో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. నాయకులు వెంకయ్య, ఎంపీడీవో మహేందర్‌, సర్పంచ్‌ నానయ్య, ఏపీఓ రాజన్న ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

పెంచికలపేట: మండల కేంద్రంలోని జడ్పీఎస్‌ఎస్‌ పాఠశాలలో, కొండపల్లి ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటారు. సర్పంచ్‌లు కావ్య, కమల, సంజీవ్‌, ఎస్‌ఎంసీ చైర్మన్‌ నాందేవ్‌, ఎంపీటీసీ రాజన్న, తహసీల్దార్‌ రఘునాథ్‌, ఎంపీడీవో గంగాసింగ్‌, ఎస్సై రామన్‌కుమార్‌, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 

దహెగాం: మండలంలోని కల్వాడ ఆశ్రమోన్నత పాఠశాల, కస్తూర్బా గాంధీ విద్యాలయం, పోలీసు స్టేషన్‌, ఒడ్డుగూడ, ఖర్జీ, చిన్నరాస్పెల్లి గ్రామాల్లో బుధవారం స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా మొక్కలు నాటారు. సర్పంచ్‌లు లక్ష్మి, అమ్మక్క, గోపిబాయి, సంజీవ్‌, ఎంపీటీసీ జయలక్ష్మి, ఎంపీడీవో రాజేశ్వర్‌గౌడ్‌, ఎస్సై సనత్‌కుమార్‌, పీఏసీఎస్‌ వైస్‌చైర్మన్‌ ధనుంజయ్‌, ఎస్‌వో రమాదేవి, అంగన్‌వాడీ టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. 

బెజ్జూరు: మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా మొక్కలను నాటారు. ఎంపీపీ రోజారమణి, ఎంపీటీసీ పర్వీన్‌సుల్తానా, సర్పంచ్‌ శారద, నాయకులు జాహీద్‌, జావీద్‌, ప్రధినోపాధ్యాయుడు రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

పోరాట వీరుడికి ఘన నివాళి

కెరమెరి: జోడేఘాట్‌ క్షేత్రాన్ని బుధవారం జడ్పీ చైర్‌ పర్సన్‌ కోవలక్ష్మి, కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌, ఎమ్మెల్యే ఆత్రంసక్కు, ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి, అదనపుకలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌లు అజాదికా అమృత్‌మహోత్సవంలో భాగంగాసందర్శించి కుమరంభీంకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర ఫలాలు సిద్దించి 75సంవత్సరాలు పూర్తైన నేపథ్యంలో గిరిజనపోరాట యోధుడిని స్మరించుకోవడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం మొక్కలు నాటారు. అనంతరం మ్యూజియంలో పగుళ్లు ఏర్పడడంతో వాటిని మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. డీఎఫ్‌వో దినేష్‌కుమార్‌, డీఆర్డీవో పీడీ సురేందర్‌, డీపీఓ రమేష్‌ తదితరులున్నారు.

Updated Date - 2022-08-11T04:05:01+05:30 IST