ఆ గ్రామాన్ని బొమ్మల ప్రపంచం అంటారు... కారణం తెలిస్తే షాకవుతారు!

ABN , First Publish Date - 2022-06-21T15:09:35+05:30 IST

ప్రపంచంలో అనేక విచిత్రమైన ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో...

ఆ గ్రామాన్ని బొమ్మల ప్రపంచం అంటారు... కారణం తెలిస్తే షాకవుతారు!

ప్రపంచంలో అనేక విచిత్రమైన ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో ఒకటే జపాన్‌లోని ఈ గ్రామం. ఇక్కడ మనుషుల కంటే అధికంగా బొమ్మలు కనిపిస్తాయి. గ్రామంలో దిష్టిబొమ్మలు ప్రతిచోటా దర్శనమిస్తాయి. స్కూళ్లలో పిల్లలకు బదులు దిష్టిబొమ్మలు చదువుకుంటాయి. అలాగే టీచర్లకు బదులు దిష్టిబొమ్మలే కనిపిస్తాయి. జపాన్‌లోని ఈ గ్రామం పేరు విలేజ్ నగోరో. దాదాపు గ్రామం అంతా నిర్మానుష్యంగా ఉంటుంది. గ్రామంలో వృద్ధులు మాత్రమే కనిపిస్తారు. గ్రామంలో యువకుల సంఖ్య తక్కువగా ఉండటంతో 18 సంవత్సరాలుగా ఇక్కడ పిల్లలే పుట్టలేదు. 


ఒకప్పుడు గ్రామంలో 300 జనాభా ఉండేది. కాలక్రమంలో చాలామంది గ్రామాన్ని వదిలివెళ్లిపోయారు. ఈ గ్రామంలో నివసిస్తున్న అయానో సుకిమి ఆ గ్రామాన్ని దిష్టిబొమ్మల గ్రామంగా మార్చింది. దుస్తులపై ఆమెకున్న అభిరుచి కారణంగా రకరకాలుగా దిష్టిబొమ్మలను తయారు చేసింది. తరువాత వాటిని గ్రామంలోని అన్ని ప్రాంతాల్లో పెడుతూ వచ్చింది. ఈ దిష్టిబొమ్మల గ్రామాన్ని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు. అక్టోబరు మొదటి ఆదివారం నాడు ఇక్కడ ఉత్సవాన్ని నిర్వహిస్తుంటారు. 

Updated Date - 2022-06-21T15:09:35+05:30 IST