అధ్వానంగా ఆచంట శివారు వంగతాళ్ల చెరువు రహదారి
గోతులు, బురదతో వాహనదారుల అవస్థలు
ఆచంట, జూలై 5: గ్రామీణ ప్రాంత రహదారులు గోతులు, బురదతో అధ్వానం కావడంతో వాహనదారులు స్థానికులు అవస్థలు పడుతున్నారు. ఆచంట శివారు వంకతాళ్ల చెరువు రహదారి బుదరమయంగా మారింది. గతంలోనే ధ్వంసమైన రెండు కిలో మీటర్ల రహదారి అభివృద్ధికి నోచుకోలేదు. వర్షాలకు మరింత అధ్వానంగా మారింది. కుమ్మరగరువు, దేవ, సానబోయిన వారి పాలెం గ్రామస్థులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం నడవడానికి వీలు లేకుండా ఉందని వంకతాళ్ల చెరువు గ్రామస్థులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గోతులు పడిన వేండ్ర– కొండేపూడి రహదారివేండ్ర – కొండేపూడి రహదారి అధ్వానం
పాలకోడేరు: వేండ్ర – కొండేపూడి రహదారి గోతులమయం కావడంతో ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. వర్షంవస్తే రహదారిపై వర్షంనీరు చేరి బురదమయంగా మారుతుంది. ఎండవస్తే గోతులతోపాటు ప్రయాణికులు దుమ్ము కొట్టుకుపోతారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చిన ప్రకారం రహదారులను ఏర్పాటుచేసి ప్రయాణికులకు భద్రత కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.