ప్రజా సమస్యల పరిష్కారానికే ‘పల్లె సందర్శన’

Jun 17 2021 @ 00:57AM
బీబీనగర్‌ మండలం బ్రాహ్మణపల్లి గ్రామస్థులతో మాట్లాతున్న ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి

 భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి 

బీబీనగర్‌, జూన్‌ 16: ప్రజా సమస్యలను గుర్తించి సత్వరమే పరిష్కరించే లక్ష్యంతో ‘పల్లెల సందర్శన’ కార్య క్రమాన్ని ప్రారంభినట్లు భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి తెలపారు. బుధవారం బీబీనగర్‌ మండలం బ్రాహ్మణపల్లి గ్రామాన్ని ఆయన స్థానిక నేతలు, ప్రజాప్రతినిధులతో కలిసి సందర్శించారు. వాడవాడలా తిరిగి గ్రామస్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. గ్రామంలో శంకుస్థాపన చేసిన సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయని, వాటిని సత్వరమే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు ఎమ్మెల్యేకు విన్నవించారు. అనంతరం కరోనా, ఇతర కారణాలతో మృతి చెందిన 25 మంది కుటుంబాలకు పైళ్ల ఫౌండేషన్‌ తరఫున ఆర్థికసాయం అందజేశారు. అనంతరం మండల పరిషత్‌ కార్యాలయంలో సీఎం సహాయ నిధి నుంచి  50మంది బాధితులకు  మంజూరైన రూ.17.71 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ యర్కల సుధాకర్‌గౌడ్‌, జడ్పీటీసీ గోలి ప్రణిత,  వైస్‌ ఎంపీపీ గణే్‌షరెడ్డి,  గొలి పింగల్‌రెడ్డి, బొక్క జైపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాస్‌, సుదర్శన్‌రెడ్డి, సర్పంచ్‌లు సత్తిరెడ్డి, భాగ్యలక్ష్మి, ఎంపీటీసీ సత్యమణి, దేవేందర్‌ రెడ్డి నర్సిరెడ్డి, సుధాకర్‌రెడ్డి, బాల్‌రెడ్డి పాల్గొన్నారు.

జగతిగౌడ్‌ మృతి పార్టీకి తీరని లోటు 

భూదాన్‌పోచంపల్లి: గంగపురం జగతిగౌడ్‌ మృతి టీఆర్‌ఎస్‌ పార్టీకి తీరని లోటు అని  ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని ఇంద్రియాల గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు జగతిగౌడ్‌ ఇటీవల మృతి చెందగా ఆయన స్మారక స్తూపాన్ని  ఎమ్మెల్యే  ఆవిష్కరించి నివాళులర్పించారు. కార్యక్రమంలో జగతిగౌడ్‌ కుటుంబసభ్యులు పాల్గొన్నారు.


Follow Us on: