చెరువు మట్టితోలకాన్ని అడ్డుకున్న గ్రామస్థులు

ABN , First Publish Date - 2022-05-21T06:34:38+05:30 IST

రాత్రి వేళలో యథేచ్ఛగా జరుగుతున్న మట్టి తవ్వకాలను మండలంలోని రెడ్డిచర్ల, మల్లారెడ్డిపల్లి గ్రామస్థులు అడ్డుకున్నారు.

చెరువు మట్టితోలకాన్ని అడ్డుకున్న గ్రామస్థులు
పోలీసు స్టేషన్‌కు చేరిన వాహనాలు

కొమరోలు, మే 20: రాత్రి వేళలో యథేచ్ఛగా జరుగుతున్న మట్టి తవ్వకాలను మండలంలోని రెడ్డిచర్ల, మల్లారెడ్డిపల్లి గ్రామస్థులు అడ్డుకున్నారు.

 మూడు రోజుల నుంచి చెరువు మట్టిని తరలిస్తూ వాహనాల శబ్ధంతో గ్రామాల్లో కునుకులేకుండా ఉం టోందని పలువురు గ్రామస్థులు పే ర్కొంటున్నారు. ఆయా ప్రజలు పలు మార్లు రెవెన్యూ అధికారులకు తెలి పినా పట్టించుకోలేదు. రాత్రి సమ యాల్లో వాహనాలు ఎక్కువ సంఖ్యలో వేగంగా మట్టిని తోలుతుండడంతో గ్రామస్థులు అడ్డుకున్నా మరలా షరామామూలుగానే తొలకం జరుగుతోంది. దీంతో ఆయా గ్రామస్థులు పలుమార్లు రెవెన్యూ అధికారులకు తెలిపినా వారిపై ఎలాంటి చర్యలు తీసు కోవడంలేదని ప్రజలు ఆవేదన చేందారు. ఈ విషయాన్ని గ్రామస్థులు ప్రచారమాద్యమాల ద్వారా జిల్లా అధికారులకు ఫిర్యాదుచేయడంతో మైనింగ్‌ అధికారులు రంగంలోకి తిగి గ్రామస్తుల సహకారంతో మట్టితోలుతున్న జేసీబీలు 3, ఒక టిప్పర్‌ను గుర్తించి సీజ్‌చేసి స్ధానిక ఎస్‌ఐ సాంబశివయ్యకు స్వాధీనం చేశారు. వాహనాలను సీజ్‌చేసి స్ధానిక పోలీసులకు అప్పగించినట్లు మైనింగ్‌ ఏఈ అశోక్‌కుమార్‌ అప్పగించారు. 


Updated Date - 2022-05-21T06:34:38+05:30 IST