కల్వర్టు నిర్మించాలని ఆందోళన

ABN , First Publish Date - 2022-09-24T06:09:46+05:30 IST

కాట్రేనిపాడు ప్రధాన రహదారిలో కొండవాగు ప్రవహించే ప్రదేశంలో కల్వర్టు నిర్మించాలని శుక్రవారం గ్రామ స్థులు ఆందోళన చేశారు.

కల్వర్టు నిర్మించాలని ఆందోళన
కాట్రేనిపాడులో ప్రధాన రహదారి పై ఆందోళన చేస్తున్న స్థానికులు

ముసునూరు, సెప్టెంబరు 23: కాట్రేనిపాడు ప్రధాన రహదారిలో కొండవాగు ప్రవహించే ప్రదేశంలో కల్వర్టు నిర్మించాలని శుక్రవారం గ్రామ స్థులు ఆందోళన చేశారు. శుక్రవారం రహదారి పై ఏర్పడిన పెద్ద గుంతల్లో బైక్‌ ప్రమాదానికి గురైంది. కాట్రేనిపాడు ఫారెస్ట్‌ నుంచి పెద్దచెరువులోకి వర్షపునీరు వెళ్ళే కొండవాగు ప్రధాన రహదారి పై నుంచి వెళ్ళాల్సి ఉందని, ఈ నేపథ్యంలో ఒక మోస్తరు వర్షానికి రహదారిపై వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందని స్థానికులు వాపోతున్నారు. దీనికితోడు నీటి ప్రవాహానికి రహదారిపై పెద్దపెద్ద గుంతలు ఏర్పడడంతో  వాహనదారులు ప్రమాదానికి గురవుతున్నారని  ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు ఆర్‌అండ్‌బి అధికారులు రహదారిని అభివృద్ధి చేస్తున్నారే తప్ప కొండవాగు ప్రవహించే ప్రదేశంలో కల్వర్టు నిర్మించడం లేదని  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఇప్పటికైనా కల్వర్టు నిర్మించేలా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు.

Updated Date - 2022-09-24T06:09:46+05:30 IST