భూ ఆక్రమణ ను అడ్డుకున్న గ్రామస్థులు

ABN , First Publish Date - 2021-03-01T04:51:43+05:30 IST

మండలంలోని రాఘవరాజుపురం గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్‌ 86లో ఉన్న 25 సెంట్ల భూమిని కొంతమంది ఆక్రమణ చేయడానికి ప్రయత్నించగా గ్రామస్థులు అడ్డుకున్నారు.

భూ ఆక్రమణ ను అడ్డుకున్న గ్రామస్థులు

రైల్వేకోడూరు రూరల్‌, ఫిబ్రవరి 28: మండలంలోని రాఘవరాజుపురం గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్‌ 86లో ఉన్న 25 సెంట్ల భూమిని కొంతమంది ఆక్రమణ చేయడానికి ప్రయత్నించగా గ్రామస్థులు అడ్డుకున్నారు. గ్రామస్థుల వివరాలు మేరకు రాఘవరాజుపురంలోని విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ ఎదురుగా చెన్నై తిరుపతి హైవే పక్కన ఉన్న సర్వే నంబర్‌ 86లో 25 సెంట్ల భూమిని కొంతమంది అక్రమణ చేసి చదును చేస్తుండగా గ్రామస్థులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని అడ్డుకున్నట్లు తెలిపారు. భూమిని గుడి నిర్మాణం కోసం చదును చేస్తున్నట్లు ఆక్ర మణదారులు తెలిపారన్నారు. గ్రామస్థులతో చర్చించకుండా గుడిని ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలుతో చర్చించడంతో వివాదం సద్దుమ ణిగింది. ఈ సంఘటన పై ఎస్‌ఐ పెద్ద ఓబన్నను వివరణ కోరగా తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.

Updated Date - 2021-03-01T04:51:43+05:30 IST