ఏబీఎన్‌ కోసం గ్రామాలు కదిలె!

ABN , First Publish Date - 2021-01-21T09:11:57+05:30 IST

ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి చానల్‌ ప్రసారాలు నిలిపివేయడంపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

ఏబీఎన్‌ కోసం గ్రామాలు కదిలె!

చానల్‌ ప్రసారాలు పునరుద్ధరించాలని

‘పశ్చిమ’లో రెండు గ్రామాల్లో నిరసనలు


తాడేపల్లిగూడెం, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి చానల్‌ ప్రసారాలు నిలిపివేయడంపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. 


పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలోని జగన్నాథపురం, గంటావారిగూడెం గ్రామాలు బుధవారం ప్రత్యక్ష ఆందోళనకు దిగాయి. గంటావారిగూడెం లో 600 కనెక్షన్లు ఉంటే, అందులో 500 మంది ఏబీఎన్‌ ప్రసారాలను పునరుద్ధరించాలని రోడ్డెక్కారు. జగన్నాథపురంలో 400 కనెక్షన్లు ఉండగా, 300 మంది ఉద్యమంలోకి వచ్చారు. ఈ రెండు గ్రామాల ప్రజలు జగన్నాథపురంలో రెండు కిలోమీటర్ల మేర నిరసన ర్యాలీ నిర్వహించారు. ‘మీడియా గొంతునొక్కి నిజాలను సమాధి చేస్తారా’.... ‘ఇదేమీ రాజ్యం, దోపిడీ రాజ్యం... దొంగల రాజ్యం’ అంటూ నినాదాలు చేశారు. అంబేడ్కర్‌ విగ్రహం వద్ద కొద్దిసేపు ధర్నా నిర్వహించి, తమ సంతకాలతో తయారుచేసిన వినతి పత్రాన్ని సమర్పించారు. అలాగే, స్థానిక కేబుల్‌ నెట్‌ వర్క్‌ నిర్వాహకులను కలుసుకొని, ఏబీఎన్‌ ప్రసారాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. వీరి ఉద్యమానికి టీడీపీ నాయకులు మద్దతు తెలిపారు.

Updated Date - 2021-01-21T09:11:57+05:30 IST