Advertisement

గుక్క తిప్పుకోకుండా దేవీ మంత్రాన్ని చెప్పిన విలన్

Oct 17 2020 @ 22:55PM

సత్యప్రకాశ్‌ అందరికీ తెలిసిన నటుడే.. అదే విలనే. పోలీస్‌ స్టోరీ చిత్రం తర్వాత అందరికీ సత్యగా నోటెట్‌ అయిన సత్యప్రకాశ్‌.. ఆ తర్వాత విలన్‌గా ఎన్నో చిత్రాలలో నటించారు. ఇప్పుడు డైరెక్టర్‌గా మారి చిత్రాలను రూపొందిస్తున్నారు. తాజాగా ఆయన దేవీ నవరాత్రులు ప్రారంభమైన సందర్భంగా.. ఓ మంత్రం చెప్పి.. ఆ మంత్రం పాటిస్తే.. ప్రతి ఒక్కరిని అమ్మవారు కరుణిస్తుందని తెలిపారు. 

Advertisement

''నమస్తే.. నా పేరు సత్యప్రకాశ్‌. సౌతిండియాలో నేను నటుడు, డైరెక్టర్‌ని. నవరాత్రులు ప్రారంభమయ్యాయి. అంటే దుర్గాదేవి తల్లి ఈ రోజు నుంచి ఎంతో మహత్యం కలిగి ఉంటుంది. ప్రతి ఒక్కరూ నవరాత్రుల సమయంలో సాయంత్రం 6 గంటలకు అమ్మవారికి రెండు దీపాలు పెట్టి.. మీ మనసులో ఉన్న ఏ కోరికను కోరినా.. దుర్గమ్మ వారు వెంటనే తథాస్తు.. అని మీ కోరికను తీర్చేస్తుంది. ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని ఖచ్చితంగా కొలవండి. అమ్మవారిని ఆరాధించండి, పూజ చేయండి. దీనికి నేను ఒక చిన్న మంత్రం చెబుతాను. రోజూ ఈ మంత్రం చదవడం కుదరదు అనుకుంటే.. విన్నా సరిపోతుంది.." అని చెబుతూ.. గుక్క తిప్పుకోకుండా దేవీ మంత్రం చెప్పారు సత్యప్రకాశ్‌. ఈ మంత్రి పఠిస్తే.. నూటికి నూటక్క శాతం అమ్మవారి కరుణ ఉంటుందని ఆయన తెలిపారు. మరెందుకు ఆలస్యం.. సత్యప్రకాశ్‌ చెప్పిన మంత్రం ఏమిటో పై వీడియోలో చూస్తూ.. వినేసి.. అమ్మవారి ఆశీర్వచనాలు పొందండి.

Follow Us on:
Advertisement
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.