వర్జీనియాలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

ABN , First Publish Date - 2021-09-15T01:48:50+05:30 IST

అమెరికాలోని వర్జీనియాలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి.

వర్జీనియాలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

కిడ్స్ టు కిడ్స్ నెట్‌వర్క్, ఎన్నారై స్ట్రీమ్స్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు

వర్జీనియా: అమెరికాలోని వర్జీనియాలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. కిడ్స్ టు కిడ్స్ నెట్‌వర్క్, ఎన్నారై స్ట్రీమ్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ 20 అడుగుల గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. సుమారు 1,800 మందికి ఏర్పాటు చేసిన సహపంక్తి అరిటాకు భోజనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గణపయ్యకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం 500 పౌండ్స్ లడ్డు ప్రసాదాన్ని పంచి పెట్టారు. అనంతరం గణనాథుడి ప్రతిమను ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. 


ఈ సందర్భంగా చిన్నారులు, మహిళలు కాషాయ జెండాలను పట్టుకొని ఊరేగింపులో పాల్గొన్నారు. నిమజ్జనోత్సవంలో పిల్లలు, పెద్దలు అంతా ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. సుమారు 70  కార్ల ఊరేగింపులో పలువురు ప్రవాస భారతీయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహణకు సహకరించిన సుధా కొండపు, వరుసగా 5వ యేటా విజయవంతంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించడానికి సహకరించిన తేజ రేపేర్ల దంపతులకు ప్రవీణ్ శ్యామల, సతీష్, శ్రీనివాస్ కాట్రగడ్డ, నరసింహ రెడ్డి, నాని, రవి యార్లగడ్డ, బుల్లి, నారాయణ, మురళి, కరుటూరి, సాయిబాబు, వినయ్ మరియు శ్రేయోభిలాషులకు నిర్వాహకులు ఉయ్యురు శ్రీనివాస్, కిషోర్ బత్తినేని, ప్రతాప్ కృతజ్ఞతలు తెలియజేశారు.






Updated Date - 2021-09-15T01:48:50+05:30 IST