Americaలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

ABN , First Publish Date - 2021-09-13T01:01:47+05:30 IST

అమెరికాలోని తెలుగు వారి ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. కాలిఫోర్నియాలో అక్కడి తెలుగు ప్రజల అసోసియేషన్ అయిన ఫ్రీమోంట్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో..

Americaలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

కాలిఫోర్నియా: అమెరికాలోని తెలుగు వారి ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. కాలిఫోర్నియాలో అక్కడి తెలుగు ప్రజల అసోసియేషన్ అయిన ఫ్రీమోంట్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్ రెడ్డి, స్వర్ణ లత, భాను చౌదరి, శ్రీకాంత్ యాదవ్, నోయల్, సాయి కృష్ణ యాదవ్, అనుపమ, నిఖిత, సాయి మౌపర్తి, ధర్మేంద్ర, అశోక్, రోహన్, లోకేశ్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది ప్రతి ఒక్కరికీ శుభం కలగాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వారంతా విఘ్నేశ్వరుడిని ప్రార్థించారు. కార్యక్రమంలో స్థానికంగా నివశిస్తున్న దాదాపు 40 తెలుగు కుటుంబాలు వేడుకల్లో పాల్గొన్నాయి.



Updated Date - 2021-09-13T01:01:47+05:30 IST